ఒత్తిడి యొక్క మూల కారణాలను గుర్తించండి మరియు వాటిని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోండి.
తలనొప్పి, కండరాల ఉద్రిక్తత, అలసట, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి శారీరక లక్షణాలు మరియు ఆందోళన, చిరాకు, కోపం, నిరాశ వంటివి మానసిక లక్షణాలు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య ఆహారం , తగినంత నిద్ర మరియు రోజువారీ వ్యాయామం బాగా ఉపకరిస్తాయి.శరీరానికి తగిన విశ్రాంతి మరియు ధ్యానం, యోగా, లేదా లోతైన శ్వాస వ్యాయామాలు మేలుచేస్తాయి.మన భావాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు